21.5 C
Hyderabad
Wednesday, January 20, 2021

సోనూసూద్ కు గుడికట్టి అభిమానాన్ని చాటుకున్న దుబ్బతండ గిరిజనులు

తనకు ఏ సంబంధం లేకపోయినా కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి నిజమైన హీరో అనిపించుకున్నాడు సినీ నటుడు సోనూసూద్. అడిగిన వారికి.. అడగని వారికి సాయం చేస్తూ.. వారి కళ్లలో ఆనందాన్ని తన ఆనందంగా భావించాడు. వలస కార్మికులను తన సొంత ఖర్చుల ద్వారా ఇంటికి పంపించాడు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి మార్గం చూపించాడు. సాయం కావాలి అనే మాట తన చెవిన పడితే చాలు.. నేనున్నా అంటూ కొన్నిసార్లు తన ప్రతినిధుల ద్వారా, కొన్నిసార్లు తానే స్వయంగా సాయం చేసి హీరో అనిపించుకున్నాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించినా.. నిజ జీవితంలో అందునా.. కరోనా లాంటి విపత్కర సమయంలో సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. రియల్ హీరో గుణాన్ని చాటి ఎంతోమంది రీల్ హీరోలను దాటి ప్రాంతాలకతీతంగా ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నాడు.

సోనూసూద్ సేవలకు ఆయ‌న సేవ‌ల‌కు సామాన్యుల‌ కాదు.. సెల‌బ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఆ మధ్య దసరా సమయంలో కలకత్తాలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద సోనూసూద్ ప్రతిమ ఉంచి ఆయనపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. అయితే.. మనిషిని ప్రేమించడంలో ఎల్లలు మరిచిపోయే తెలంగాణ ప్రజలు మరో అడుగు ముందుకేసి ఏకంగా సోనూసూద్  విగ్రహం పెట్టి గుడి కట్టించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బ తండాలో గిరిజనులు సోనూసూద్‌కు గుడి కట్టి పూజ‌లు చేస్తున్నారు గిరిజ‌నులు. అడగకపోయినా స్వయంగా ముందుకు వచ్చి ఎంతోమందికి ఆప‌న్నహ‌స్తం అందించిన సోనూసూద్‌కి గుడి క‌ట్టడం సంతోషంగా ఉంద‌టున్నారు దుబ్బతండ గ్రామస్థులు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...