దేశ రాజధాని ఢిల్లీలో గురువారం స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. గురువారం ఉదయం 9:17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయని.. 15 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం కేంద్రీకృతమై ఉందని ఎన్సీఎస్ ట్వీటర్లో వెల్లడించింది.