29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ఎల్ఈడి టీవీలో పాము.. షాకైన మెకానిక్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. దిగువమెట్ట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర ఉన్న ప్రముఖ కంపెనీ ఎల్ఈడీ టీవీ ఇటీవల పాడైంది. రిపేరు చేయాలని గిద్దలూరులో ఉన్న మెకానిక్ దగ్గరకు తీసుకొచ్చాడు. రిపేర్ చేసేందుకు ఎల్ఈడీ టీవీని విప్పిన మెకానిక్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఖంగుతిన్నాడు.

ఎల్ఈడీ టీవీ ప్యానల్ లో పాము చనిపోయిన స్థితిలో పడి ఉంది. పాము మృతి కారణంగానే ఎల్ఈడి టీవీలో ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ కావడంతోనే టీవీ పాడైందని మెకానిక్ తేల్చాడు. అసలు అంత పెద్ద పాము ఎల్ఈడీ టీవీలోకి ఎలా వెళ్లిందోనని అయోమయంలో వాళ్లు పడిపోయారు.

- Advertisement -

Latest news

Related news