28.3 C
Hyderabad
Wednesday, February 24, 2021

మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు

లాక్‌డౌన్ నుంచి ఎంతో మందికి సాయం చేస్తున్న నటుడు సోనుసూద్‌ మరోసారి గొప్పసాయం అందించాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారికి ప్రాణం పోశారు.
పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీలకు ఎనిమిది నెలల పిల్లోడున్నాడు. ఆ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడి సాయంతో చిన్నారి తల్లిదండ్రులు ముంబై వెళ్లి తమ కష్టాన్నిసోనూసూద్ కు చెప్పుకున్నారు. సోనూసూద్‌ వెంటనే ఆ బాలుడిని ముంబైలోని నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించి, బాలుడి గుండె ఆపరేషన్‌ కు అయ్యే ఖర్చును భరించారు. అలా సోషల్ మీడియాలో మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.

- Advertisement -

Latest news

Related news