29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

సుప్రీం కోర్టుకు సోనూసూద్.. ఎందుకంటే..

సోషల్ సర్వీస్‌తో రియల్‌ హీరోగా మారిన నటుడు సోనూసూద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతకీ అసలేమైందంటే..


సోనూసూద్‌కు ముంబైలోని జుహు ప్రాంతంలో ఆరంతస్తుల భవనం ఉంది. అయితే, అనుమతులు లేకుండా ఈ కాంప్లెక్స్‌ను హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు.. ఆయనకు నోటీసులు పంపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై, బీఎంసీ చేసిన అభ్యంతరాలను స‌వాల్ చేస్తూ సోనూసూద్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే దిగువ కోర్టు ఆయన పిటిషన్‌ను అంగీకరించక పోవడంతో హైకోర్టుకు వెళ్లారు. చివరికి బాంబే హై కోర్టు కూడా తన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అందుకే చివరిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


ఈ విషయం గురించి సోనూసూద్‌ తరఫు న్యాయవాది వినీత్‌ ధందా మాట్లాడుతూ.. తన క్లైంట్‌ పట్ల బీఎంసీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. “లాక్‌డౌన్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్‌ ఇమేజ్‌కు భంగం కలిగిలా వ్యవహరించింది. సోనూసూద్‌ను చాలా అగౌరవ పరిచేలా మాట్లాడింది. తనను నేరస్థుడిగా వర్ణించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాం. నా క్లైంట్‌ పట్ల కానీ నా క్లైంట్ సోనూసూద్‌ చట్టాన్ని అతిక్రమించలేదు. నిబంధనలకు లోబడే నడుచుకున్నార”ని ఆయన అన్నారు.

- Advertisement -

Latest news

Related news