23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

స్పేస్ టూర్‌కి వెళ్తున్న పర్యాటకులు వీళ్లే..

భూమి నుంచి ఆకాశాన్ని చూడడం మామూలే.. కానీ ఆకాశం నుంచి భూమిని చూస్తే ఆ థ్రిల్లే వేరు. అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి నుంచి మన భూమి, చంద్రుడిని ఒక్కసారైనా కళ్లారా చూడాలి. అన్న కోరిక చాలామందికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ కోరికలన్నీనిజం చేసుకోవచ్చు. రోదసి లోకి నేరుగా తీసుకెళ్లే స్పేస్ టూర్స్ రెడీ అయ్యాయి. కాకపోతే భారీగా ఖర్చవుతుంది మరి.


ప్రపంచం నలుమూలలకు మాత్రమే కాదు, ఏకంగా అంతరిక్షంలోకి కూడా ట్రావెల్ చేసే టూర్స్ వచ్చేశాయి. మీ దగ్గర టికెట్ డబ్బులుంటే చాలు.. రోదసిలోకి నేరుగా తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర దింపుతారు. మొదటి సారిగా ముగ్గురు టూరిస్టులతో స్పేస్ టూర్ చేసేందుకు అక్సియోమ్ సంస్థ రెడీ అవుతుంది.


ముగ్గురు పర్యాటకులతో.. అక్సియోమ్ అనే సంస్థ స్పేస్ టూర్ కు రెడీ అయింది. అక్సియోమ్ నిర్వహిస్తున్న ‘ఎఎక్స్-1 స్పేస్ మిషన్’ అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తోంది. దీనికోసం నాసాతో ఒప్పందం కుదర్చుకుంది. అలాగే స్పేస్ ఎక్స్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ ను కూడా డెవలప్ చేస్తోంది.


అంతరిక్షంలోకి వినోద యాత్ర చేయాలంటే ఖర్చు మామూలుగా ఉండదు. ఒక్కొక్కరికి ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు అవుతుంది. అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ ల్యారీ కానర్, కెనడా బిజినెస్ మ్యాన్ మార్క్ పాటీ, ఇజ్రాయిల్ పారిశ్రామికవేత్త, ఫైటర్ విమానం మాజీ పైలట్ ఐటన్ స్టిబ్బే.. ఈ ముగ్గురు ఐఎస్‌ఎస్‌ ట్రిప్ కోసం నాలుగొందల కోట్లు చెల్లించడానికి రెడీగా ఉన్నారు. వచ్చే జనవరిలో వీళ్ల ప్రయాణం ఉండబోతోంది.
ప్రైవేట్ వ్యోమగాములతో.. స్పేస్ లోకి ప్రయాణించబోతున్న తొలి మిషన్‌గా ఎఎక్స్-1 రికార్డు సృష్టించబోతుంది. ఈ పర్యాటక బృందానికి నాసాకు చెందిన మాజీ ఆస్ట్రోనాట్ మైఖేల్ లోపేజ్ సారథ్యం వహించనున్నారు. ఈ మిషన్ సక్సెస్ అయితే.. ముందుముందు పర్యాటకుల సంఖ్యను పెంచి, టికెట్ ధరను తగ్గించే అవకాశం ఉంది.

- Advertisement -

Latest news

Related news