29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఇప్పటివరకు 50లక్షలమంది సందర్శించారని మోదీ అన్నారు.


దేశంలోని పలు ప్రాంతాలనుంచి కెవాడియాకు 8 రైళ్లను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ.. పెరిగిన కనెక్టివిటీతో ప్రతి రోజూ ఐక్యతావిగ్రహాన్ని లక్ష మంది సందర్శిస్తారని ఓ సర్వే చెప్తోందని అన్నారు. కెవాడియా గుజరాత్ లోని ఓ చిన్న మారుమూల ప్రాంతం కాదని..ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారుతోందని మోదీ తెలిపారు. పెరుగుతున్న కనెక్టివిటీ వల్ల కొత్త ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి లభిస్తుందని మోదీ చెప్పారు.

- Advertisement -

Latest news

Related news