ఏపీలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం శివారు కొమరేపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ఒకేసారి ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 21 మంది వింత వ్యాధితో ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలసుకున్న స్థానిక ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి సునంద గ్రామాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అస్వస్థతకు గురైన వారిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.