బీఎస్సీ డిగ్రీ చదువుతున్న హరిద్వార్ నివాసి సృష్టి గోస్వామి ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనుంది. అయితే ఈ బాధ్యతలు కేవలం ఒక్కరోజు మాత్రమే. రేపు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకోని ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. దీంతో రేపు ఈ యువతి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది.