29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రావ‌ణ లంక‌లో పెట్రోల్ రూ.51 అంటూ కేంద్రంపై సెటైర్

సామన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజీల్ రేట్లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వెరైటీగా స్పందించారు. కేంద్రంలోని సొంత ప్రభుత్వంపై సెటైర్ వేస్తూ ట్విట్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘రాముడి జన్మభూమి అయిన భారతదేశంలో లీటల్ పెట్రోల్ ధర రూ. 93, సీత పుట్టిన నేపాల్‌లో రూ. 53, రావణుడి శ్రీలంకలో కేవలం రూ.51 మాత్రమే’ అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు.

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజీల్ రేట్లు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లో పెట్రోల్ రేటు ఏకంగా రూ.100 దాటింది. తాజాగా కేంద్ర బడ్జెట్ లో పెట్రోల్ పై రూ.2.50, డీజీల్ పై రూ.4 అగ్రి సెస్ విధించనున్నట్లు ప్రతిపాదించింది. దీంతో రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో బీజీపీ ఎంపీ సామాజిక మాధ్యమాల్లో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Latest news

Related news