29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

విదేశీ టూర్స్‌కే యూత్ ఓటు

మరికొద్ది రోజుల్లో వేసవి రాబోతోంది. వేసవి అంటే అందరికీ గుర్తొచ్చేది టూర్స్. వేసవి సెలవల్లో ఆలా ఓ టూరేసి రావాలని అందరికీ ఉంటుంది. కానీ పోయినసారి వేసవి ఎప్పుడొచ్చిందో ఎప్పడెళ్లిందో తెలీదు. దాదాపు సంవత్సరం పాటు ఇంటికే పరిమితమయ్యారు చాలామంది. ఈ సారి టీకా రావడంతో మళ్లీ ప్రజల్లో పర్యాటక ఆశలు చిగురిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలన్నీ మళ్లీ రెడీ అవ్వడం, కోవిడ్ ఆంక్షలను క్రమంగా తగ్గిస్తుండడం వల్ల ఈ సారి చాలా మంది టూర్స్ వెళ్లడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అదికూడా విదేశీ టూర్స్ కోసం రెడీ అవుతున్నారని బాట్‌ ట్రావెట్‌ సెంటిమెంట్‌ ట్రాకర్‌ సర్వేలో వెల్లడైంది.
జనవరి నెలలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 6,000 మంది యువత పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందులో వెల్లడైన విషయాలేంటంటే..
వేసవిలో విదేశాల్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నామని 52 శాతం మంది వెల్లడించారు. అయితే కొవిడ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విదేశీ పర్యాటక ప్రాంతాలకు వెళ్తామని 75 శాతం మంది తెలిపారు.
విదేశీ టూర్స్ లో దగ్గర్లో ఉన్న థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు అత్యధికంగా 62 శాతం మంది యువత ఓటేశారు. ఆ తర్వాత లిస్ట్ లో సింగపూర్‌, దుబాయ్, మాల్దీవ్స్, సౌదీ అరేబియా ఉన్నాయి. వాటితో పాటు మనకు బాగా దగ్గర్లో ఉన్న శ్రీలంక , భూటాన్‌, నేపాల్ కు కూడా వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

- Advertisement -

Latest news

Related news