తనని నమ్మించి రూ.29 లక్షలు అక్రమంగా తీసుకున్నారంటూ పెరంబవూర్కు చెందిన ఆర్.షియాష్ అనే వ్యక్తి నటి సన్నీ లియోనీపై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు విచారణ చేపట్టిన పోలీసులు సన్నీని విచారించారు. ఓ టెలివిజన్ షో నిమిత్తంగా తిరువనంతపురం జిల్లా వచ్చిన ఆమెను ప్రశ్నించారు. రెండు టివీషో కార్యక్రమాలకు ఓకే చెప్పి, రూ.29లక్షలు తీసుకుని ఆ తర్వాత షో చేయలకుండా మోసం చేశారని షియాష్ ఆరోపించాడు. పోలీసులు ఆమెను ప్రశ్నించి వాంగ్మూలం తీసుకున్నారు.
