18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

నిరసనలు రాజ్యాంగబద్ధమే రైతులకు అనుకూలంగా సుప్రీం తీర్పు

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న అన్నదాతలను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆస్తి, ప్రాణ నష్టం జరగనంత వరకు నిరసనలు రాజ్యాంగబద్ధమే అని స్పష్టం చేసింది.

కేంద్రం, రైతులతో చర్చలు జరిపి ప్రతిష్టంభనకు తెరదించాలని, ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కమిటీ చేసే సూచనలను తూ.చ పాటించాలని తెలిపింది. ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చే వరకు రైతులు నిరసనలు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనలు ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదు అని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, రైతుల సమస్య పట్ల తమకు సానుభూతి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. విషయం పరిష్కరించే వరకు వ్యవసాయ చట్టాలను అమలు చేయకూడదనన్న అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నంచింది. సుప్రీంకోర్టుకేసు విచారణలో ఉండగా వ్యవసాయ చట్టాలు అమలు చేయబోమని హామీ ఇవ్వగలరా అని కేంద్రాన్ని అడిగింది. ఈ విషయంలో తాను హామీ ఇవ్వలేనని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ తీర్పు వల్ల రైతులు చర్చలకు రారని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. కాగా.. చర్చలు జరిగేందుకు ఇది కూడా ఒక మార్గమని సుప్రీం కోర్టు సూచించింది.

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...