21.2 C
Hyderabad
Monday, January 18, 2021

కొత్త సాగు చట్టాలు.. కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

కొత్త సాగు చట్టాలపై రైతుల, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై సుప్రీం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తీరు పట్ల తాము నిరాశతో ఉన్నామని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా లేదా కోర్టునే ఆ పని చేయమంటారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

‘ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.  అసలేం జరుగుతోంది.’ అని సీజేఐ జస్టిస్‌ బోబ్డే కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. చట్టాల్ని రద్దు చేయాలని తాము చెప్పడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని పేర్కొంది. సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ తన నివేదిక ఇచ్చే వరకు వ్యవసాయ చట్టాల్ని నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు తమ ఇబ్బందులను కమిటీకి తెలియజేయాలని, వాటిని కోర్టు పరిశీలిస్తుందని వెల్లడించింది. చట్టాలను నిలిపివేయడం కుదరదని, అయితే దీనిపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయొచ్చని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. కొత్త చట్టాలపై యావత్ దేశం సంతృప్తిగా ఉందని, కేవలం రెండు, మూడు రాష్ట్రాల వారు మాత్రమే ఆందోళన చేస్తున్నారన్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...