29.3 C
Hyderabad
Monday, March 1, 2021

వివాదస్పద జడ్జికి శాశ్వత హోదాపై సుప్రీం యూటర్న్

బాంబే హైకోర్టు వివాదస్పద జడ్జి పుష్ప గనెడివాలాకు శాశ్వత హోదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. జనవరి 20న పుష్పను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచికి శాశ్వత జడ్జిగా ధృవీకరిస్తూ సిఫారసు చేసింది. లైంగిక దాడులు, నేరాలపై గత కొన్ని రోజులుగా జస్టిస్ పుష్ప వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. ఆమెకు మరింత శిక్షణ అవసరమన్న సుప్రీం.. ఆమె లాయర్గా పనిచేసిన సమయంలో ఇలాంటి కేసులను డీల్ చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.

ఇటీవల పోక్సో చట్టానికి సంబంధించి జడ్జి పుష్ప గనెడివాలా రెండు వివాదస్పద ఉత్తర్వులు జారీ చేయడం చర్చకు దారితీసింది. మైనర్ ఛాతీని నిమరడం, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకపోవడం.. మైనర్ ఎదురుగా ప్యాంట్ జిప్ విప్పడం వంటివి పోక్సో చట్టం కింద నేరం కాదని ఆమె ఇచ్చిన రూలింగ్స్ వివాదాలకు కారణమయ్యాయి.

- Advertisement -

Latest news

Related news