29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సౌత్‌లో సుప్రీం కోర్టు బెంచ్?

సౌత్ ఇండియాలో సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని దక్షిణాది రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల చైర్మన్లు డిమాండ్‌ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. సౌత్ లో సుప్రీం కోర్టు బెంచ్‌ విషయంపై తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు బి.కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్‌ కండక్ట్ చేశారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు బార్‌ కౌన్సిళ్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు అంశం ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉందన్నారు. త్వరలో ఈ అంశంపై తీర్మానం చేసి ఏంచేయాలన్నది ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -

Latest news

Related news