ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి స్టూడెంట్కు డైలీ 2 జీబీ డేటాను ఉచితంగా అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డ విషయం తెలిసిందే.
ప్రస్తుతం విద్యా సంవత్సరంలో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు. కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులిచ్చారు. దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ తరహా ప్రకటన చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.