29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆడబిడ్డల శాతంలో.. తెలంగాణ మొదటి స్థానం

రోజురోజుకు సమాజంలో ఆడబిడ్డకు ఆదరణ పెరుగుతున్నది. ఒకప్పుడు ఆడబిడ్డ వద్దునుకున్నవాళ్లు.. పురిట్లోనే చంపేశారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. ఆడబిడ్డల శాతం క్రమంగా పెరుగుతున్నది. అందులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 1049 మంది బాలికలున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పట్టణ ప్రాంతంలో 1000కి 1015 మంది బాలికలు ఉండగా, గ్రామీణ ప్రాంతంలో అధికంగా 1070 మంది బాలికలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 2015-16లో ప్రతి వెయ్యి మంది బాలురకు 977 మంది బాలికలు ఉండగా, 2019-20లో వారి సంఖ్య 963కు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో 929 మంది బాలికలు ఉండగా, పట్టణాల్లో 1023మంది ఉన్నారు. 

అదీగాక ఆడబిడ్డల విద్య, వైద్యం, భద్రత సహా అన్ని రంగాల్లోనూ తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు దూసుకుపోతున్నారు. కాగా, బాలికలపై వివక్ష నిర్మూలించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను చేపడతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, పథకాల ఫలితంగా రాష్ట్రంలో బాలికల శాతం పెరిగిందని.. ప్రజల్లో అవగాహన పెరిగిందని అధికారులు వివరించారు.

- Advertisement -

Latest news

Related news