29.3 C
Hyderabad
Monday, March 1, 2021

నల్లా కనెక్షన్ లో రాష్ట్రానికి రెండోస్థానం.. కేంద్రమంత్రి అభినందనలు

వందశాతం నల్లా కనెక్షన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చోటు దక్కించుకుంది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరక్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 100% ఎఫ్‌హెచ్‌టీసీ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో గోవా మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానం సంపాదించింది.

రాష్ట్రంలో మొత్తం 54 లక్షల 6వేల 70 ఇళ్లకు ట్యాప్ కనెక్షన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వతం నీళ్లు సప్లై చేస్తున్నది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలకు నల్లా కనెక్షన్లు అందించేలా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం ద్వారా కృషి చేస్తున్నదని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. త్వరలోనే దేశంలో అన్నీ రాష్ట్రాల్లో వందశాతం నల్లా కనెక్షన్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నల్లా కనెక్షన్లలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన అభినందనలు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news