23.8 C
Hyderabad
Monday, March 1, 2021

తల్లిదండ్రులకు గుడి కట్టి పూజిస్తున్నారు

తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. ఇప్పుడు అదే మాటను ప్రాక్టికల్ గా నిజం చేశారు కర్ణాటకలోని ముగ్గురు అన్నదమ్ములు. తల్లి దండ్రులకు గుడి కట్టి పూజిస్తున్నారు.

 తన కోరికను తన తమ్ముళ్లకు చెప్పగా... అందరూ కలిసి తల్లిదండ్రులకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్మించిన గుడిలో... తల్లిదండ్రుల ప్రతిమలకు రోజూ పూజలుచేసి... తమకు ఏ విఘ్నాలూ రాకుండా కాపాడాలనీ, తమ భవిష్యత్తు బంగారంలా ఉండేలా చెయ్యాలని కోరారు.


కర్నాటకలోని కలబురిగీ జిల్లాలో ఉండే దశరథ్, ధనరాజ్, ధరనేష్ అనే ముగ్గురు అన్నదమ్ములు తల్లిదండ్రులకు గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నారు. చనిపోయిన తమ పేరెంట్స్‌ విశ్వనాథ్, లక్ష్మీబాయ్‌ని గుడిలోని విగ్రహాల్లో చూసుకుంటున్నారు. కొన్నేళ్ల కిందట చనిపోయిన తల్లిదండ్రులను మర్చిపోలేక బాధతో ఒంటరిగా ఫీలయిన దశరథ్ తల్లిదండ్రులపై ప్రేమను చాటుకోవడానికి ఏదైనా చేయాలనుకున్నాడు. అదే విషయం తన తమ్ముళ్లకు చెప్పగా.. ముగ్గురూ కలిసి తల్లిదండ్రులకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. అలా గుడి నిర్మించి, తల్లిదండ్రుల విగ్రహాలకు రోజూ పూజలుచేస్తూ.. తమకు ఏ కష్టాలు రాకుండా కాపాడాలని, తమ భవిష్యత్తు బాగుండేలా చూడమని ఆశీస్సులు కోరుకుంటున్నారు.

 మనల్ని కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులకు మనం ఏ చేసినా ఆ రుణం తీర్చుకోలేం. కర్ణాటకలోని కలబురిగీ జిల్లాలో... తమ తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను గుడి కట్టి పూజించడం ద్వారా చాటుకుంటున్నారు ముగ్గురు పిల్లలు. వారే దశరథుడు, ధనరాజ్, ధరనేష్. చనిపోయిన తమ పేరెంట్స్‌ విశ్వనాథ్, లక్ష్మీబాయ్‌ని గుడిలోని విగ్రహాల్లో చూసుకుంటున్నారు వీళ్లు. చాలాచోట్ల చూస్తుంటాం మనం ముసలివాళ్లైన తల్లిదండ్రులను పిల్లలు వదిలేస్తుంటారు. దిక్కులేని వారిని చేస్తుంటారు. ఆస్తులన్నీ తమ పేరున రాయించుకొని రోడ్డున పడేస్తుంటారు. లేదా వృద్ధాశ్రమాలకు తరలిస్తుంటారు. ఇక్కడ పూర్తి భిన్నం. కొన్నేళ్ల కిందట చనిపోయిన తల్లిదండ్రులను మర్చిపోలేకపోయిన పెద్ద కొడుకు ధశరథుడు... ఒంటరిగా ఫీలయ్యాడు. తల్లిదండ్రులపై ప్రేమను చాటుకోవడానికి ఏదైనా చెయ్యాలనుకున్నాడు.


తల్లిదండ్రులను పిల్లలు బాగా చూసుకోవాలి. వాళ్లు చనిపోయినా మేం వాళ్లను మర్చిపోలేకపోతున్నాం. తల్లిదండ్రులను పిల్లలు ఎప్పటికీ వదిలేయకూడదనే సందేశాన్ని మేము భవిష్యత్ తరాల వారికి ఇస్తున్నాం. అందరూ తల్లిదండ్రులను ప్రేమించాలని కోరుకుంటున్నాం” అని వాళ్లు అంటున్నారు.

- Advertisement -

Latest news

Related news