పంజాబ్‌లోని జలాలాబాద్‌లో పంజాబ్ సీనియర్ రాజకీయ నాయకుడు, శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కొంత మంది దుండగులు రాళ్లు, కర్రలతో ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. శిరోమణి అకాళీదల్‌కు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. అయితే ఈ దాడిపై శిరోమణి అకాళీదల్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే తమ నాయకుడిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ వచ్చిన సందర్భంలో ఈ దాడి చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి రెండు వర్గాలను చెదరగొట్టారు. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.