జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. వ్యాక్సినేషన్లో భాగంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. . ‘కోవిషీల్డ్’ ఒక్కో వయల్ ధర రూ.200గా నిర్ణయించింది. అయితే భారీగా ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడంతో నిర్ణయించిన దరకంటే తక్కువకే వచ్చే అవకాశముంది. తెలిసింది ప్రతీ వారం కొన్ని మిలియన్ల ‘కోవిషీల్డ్’ వయల్స్ సప్లయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తొలి దశలో భాగంగా 11 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను సప్లయ్ చేస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను తక్కువ ధరకు కొనుగోలు చేసేలా కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’తో పాటు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.