29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

కరోనాతో దేశం స్వావలంబన సాధించింది..ప‌్ర‌ధాని మోదీ

దేశంలో క‌రోనా వచ్చిన కొత్తలో పీపీఈ కిట్‌ల‌ను, మాస్కుల‌ను, వెంటిలేట‌ర్‌ల‌ను, టెస్టింగ్ కిట్‌ల‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు మన దేశంలోనే తయారు చేసుకుంటున్నట్లు.. ఈ విషయంలో దేశం స్వావ‌లంబ‌న సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 16వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా నాన్ రెసిడెంట్ ఇండియ‌న్స్ (ఎన్ఆర్ఐలు) ఇత‌ర దేశాల్లో మ‌రింత బ‌లోపేత‌మ‌య్యార‌ని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా స్వ‌దేశీ ఫార్మా సంస్థ‌లు త‌యారు చేసిన రెండు వ్యాక్సిన్‌ల‌తో మాన‌వాళిని ర‌క్షించేందుకు భార‌త్ సిద్ధంగా ఉన్న‌ద‌న్నారు. దేశంలో అవినీతి అంతానికి టెక్నాలజీతో చెక్ పెడుతున్నామన్నారు. దీని కారణంగానే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతున్న లక్షల కోట్ల సొమ్ము దళారుల చేతికి వెళ్లకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో పడుతుందన్నారు.

- Advertisement -

Latest news

Related news

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...