29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వీరసైనికుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు.. రాష్ట్రపతి

వీరసైనికుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సరిహద్దులను కాపాడే క్రమంలో 20 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. మన సరిహద్దులపై విస్తరణ కాంక్షతో జరిగిన ఘటనలను అధిగమించామన్నారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్రపతి చెప్పారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు ప్రతి భారతీయుడు శాల్యూట్‌ చేస్తారని చెప్పడంతోపాటు రైతుల సంక్షేమం కోసం భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు  తక్కువ టైంలోనే వ్యాక్సిన్‌ను డెవలప్ చేసి చరిత్ర సృష్టించారని కొనియడారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని అభినందించారు.  కరోనా నేపథ్యంలో కుదేలైన మన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందన్నారు.

- Advertisement -

Latest news

Related news