అకౌంట్లో ఉన్న ‘అమ్మఒడి’ సొమ్ము ఇయ్యలేదని ఆలీనే చంపిన భర్త ఉదంతం ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు అకౌంట్లో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమెపై డబ్బులు విత్డ్రా చేయాలని భీమన్న ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. అదేరోజు గుమ్మకోట సంతకు వెళ్లారు. ఎంత చెప్పినా డబ్బులు తీసేందుకు ఆమె నిరాకరించింది. కోపగించిన భర్త సంత నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పొలాల వద్ద ఆమెను బండరాయితో కొట్టి చంపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమీ తెలియదని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తానే చంపానని అంగీకరించినట్లు ఎస్సై సుధాకర్ చెప్పారు.