దేశంలో మెజారిటీ రైతులు కొత్త సాగు చట్టాలకు మద్దుతుగానే ఉన్నారని, కొందరు రైతులే వ్యతిరేకంగా ఉన్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. కొత్త సాగు చట్టాల అమలు ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు పునఃసమీక్షించాలని ఆయన కోరారు. తమ ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు చర్చించి వారి నిర్ణయం వెల్లడిస్తే దానిపై ముందుకు వెళతామన్నారు. రైతులు సానుకూలంగా స్పందించి, తమ ఆందోళనను విరమిస్తారని తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు సంఘాలతో ఇప్పటివరకు 11 దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇయ్యలేదు. మరోవైపు గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో మంగళవారం దేశరాజధానిలో రైతులు ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ ట్రాక్టర్ ర్యాలీని చేపట్టనున్నారు.