29.3 C
Hyderabad
Monday, March 1, 2021

కొత్త సాగు చట్టాలపై పీఎం మోదీ కీలక ప్రకటన

వివాదస్పద కొత్త సాగు చట్టాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 18 నెలలపాటు కొత్త సాగు చట్టాల అమలు వాయిదా వేసేందుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగానే ఉందని పునరుద్ఘాటించారు. పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ప్రధాని స్పష్టం చేశారు.

‘రైతుల సమస్యలను పెద్ద మనసుతో కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మేరకు అఖిల పక్ష సమావేశంలో ప్రధాని హామీ ఇచ్చారు. జనవరి 22న వ్యవసాయ మంత్రి ప్రకటించిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది. అగ్రికల్చర్ మినిస్టర్ తోమర్ రైతులతో చర్చించేందుక ఫోన్ కాల్ దూరంలో ఉంటారు.’ అని ప్రధాని మోదీ అఖిల పక్ష నేతల ముందు స్పష్టం చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్ చేశారు.

రైతు సంఘాలు-కేంద్రం మధ్య ఇప్పటి వరకు పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలితం ఇయ్యలేదు. దీంతో రైతు సంఘాల ఆధ్వర్యంలో జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. దాంతో కేంద్రం రైతునేతలపై కన్నెర్ర చేసింది. వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. కొత్త సాగు చట్టాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. పార్లమెంట్ ఉభయసభల ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 విపక్ష పార్టీలు బహిష్కరించాయి. ప్రస్తుతం దిల్లీ శివారుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది.

- Advertisement -

Latest news

Related news