వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు వ్యాక్సిన్ తీసుకున్న ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా ఆస్పత్రి వార్డు బాయ్ ఆ తర్వాత రోజే చనిపోయాడు. సీరం ఇన్స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ తీసుకున్నట్టు డాక్టర్లు చెప్పారు. దీనిపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇచ్చాడు. ‘మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో ఇబ్బంది పడ్డాడు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో అతను చనిపోయినట్టు తాను అనుకోవడం లేదు.’ అని చెప్పాడు.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మరో 22 ఏండ్ల వ్యక్తి సైతం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇబ్బందులు రావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎలర్జీ రియాక్షన్, తలపోటు, ర్యాష్, రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నాడని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు.