మళ్లీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ రజినీకాంత్ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహించడంపై రజినీకాంత్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రాబోనని, ఆ విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని రజినీకాంత్ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, ఇక ఆ నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచన లేదని రజినీ స్పష్టం చేశారు.
‘రజినీ మక్కల్ మంద్రమ్ నుంచి బహిష్కరణకు గురైన శ్రేణులతో కలిసి తన అభిమానులు కొందరు ఆదివారం చెన్నైలో ప్రదర్శన నిర్వహించారని, రాజకీయాల్లోకి రానంటూ తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ ప్రదర్శనలో డిమాండ్ చేశారని’ రజినీకాంత్ గుర్తుచేశారు.
‘ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నేనంటే గిట్టని వాళ్లు చేసే ఇలాంటి ప్రదర్శనల్లో దయచేసి పాలుపంచుకోకండి’ అని తన అభిమానులను ఉద్దేశించి రజినీకాంత్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు తనన బాధిస్తాయన్నారు.