32.7 C
Hyderabad
Monday, March 1, 2021

దున్నపోతు కోసం.. మూడుళ్ల జనాలు కొట్టుకున్నారు!

ఎవరైనా ఇద్దరు బలంగా ఉన్న వ్యక్తులు కొట్లాడుకుంటే.. దున్నపోతుల్లా కొట్టుకుంటున్నారు అనడం మామూలుగా ఊర్లలో వింటూనే ఉంటాము. అయితే.. ఒక్క దున్నపోతు కోసం మూడు ఊర్ల జనాలు కొట్టుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కర్ణాటకలోని దావనగెరు జిల్లాలో జరిగిన ఈ సీన్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాలుగేళ్ల వయసున్న ఒక దున్నపోతు.. దారి తప్పి దావనగెరు జిల్లాలోని సాస్వేహళ్లీ అనే గ్రామానికి వచ్చింది. అప్పటి నుంచి ఆ ఊరివాళ్లుఆ దున్నపోతును ఆంజనేయ స్వామికి మొక్కుకొని.. గుడిలో వదిలేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ దున్నపోతు తమ గ్రామానికి చెందినదని శివమొగ్గ జిల్లాలోని జాంబరగట్టే గ్రామస్తులు వచ్చారు. కాగా.. ఆ దున్నపోతును తమ ఊరి దైవం అయిన దేవుడికి వదిలామని.. ఇవ్వడం కుదరదని సాస్వేహల్లీ గ్రామ ప్రజలు పట్టుబట్టి చెప్పారు. వీరిద్దరూ దున్నపోతు కోసం కొట్లాడుతుండగా.. చీలూరు గ్రామానికి చెందిన ప్రజలు వచ్చి.. ఆ దున్నపోతు తమదని దాన్ని తమకు ఇచ్చేయాలని కోరారు. ఇక చూస్కోండి.. దున్నపోతు మాదంటే.. మాదని మూడు ఊర్ల జనాలు కొట్లాటకు దిగారు. ఆ కొట్లాట కాస్త చిలికి చిలికి గాలివానగా మారి.. దాడులు చేసుకునే వరకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మూడు గ్రామాల ప్రజలను ఒకచోట కూర్చోబెట్టి పంచాయతీ పెట్టారు. అందరూ కలిసి.. జాంబరగట్టే గ్రామస్తులకు దున్నపోతును ఇచ్చేయాలని ఒప్పందం చేసుకున్నారు. పోలీసుల రంగప్రవేశంతో.. వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అయితే.. దున్నపోతు కోసం మూడు గ్రామాల ప్రజలు కొట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.

- Advertisement -

Latest news

Related news