22.9 C
Hyderabad
Sunday, January 17, 2021

అధికారులకు చిక్కని పెద్దపులి

కుమురం భీం జిల్లాలో ఇద్దరిని హతమార్చిన పెద్దపులిని పట్టుకొని బంధించేందుకు అటవీశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. బోను ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కంది భీమన్న అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
జిల్లాలోని పలు గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న పులి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దాన్ని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నాయి. అధికారులు పన్నిన ఉచ్చును పెద్దపులి తెలివిగా తప్పించుకుంటుంది. ఎరగా వేసిన ఆహారాన్ని భోంచేసి అటవీ అధికారుల కన్నుగప్పి.. బోనుల నుంచి తప్పించుకుని దర్జాగా వెళ్లిపోతోంది. ఈసారి ఎలాగైనా పులిని పట్టుకోవాలని అధికారులు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కొమురంభీం జిల్లాలో ఇద్దరిని హతమార్చిన పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. బెజ్జూరు అడవుల్లో ఏ2 పులిని బంధించేందుకు సీరియస్‌ఆపరేషన్ చేపడుతున్నారు.
కంది భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు ఆ పరిసరాల్లో 10 బోన్లు ఏర్పాటు చేశారు. ఎరగా లేగ దూడలను ఉంచారు. వందకుపైగా సీసీటీవీ కెమెరాలతో రెస్క్యూ ఆపరేషన్‌ను చేస్తున్నారు. రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లు అలర్ట్ గా ఉన్నారు. పులి రాగానే మంచెపై నుంచి మత్తు మందు ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు. 60 మంది టైగర్ ట్రాకర్స్, మహారాష్ట్ర నిపుణులు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌ను సీసీఎఫ్ వినోద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా పెద్దపులిని పట్టుకుంటామంటున్నారు అధికారులు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...