అటవీ అధికారుల బోనులో చిక్కకుండా.. తప్పించుకొని తిరుగుతూ పరిసర ప్రాంతాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు కుమురం భీమ్ జిల్లా అధికారులు, ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. 40 మందితో కూడిన స్పెషల్ యాక్షన్ టీమ్ పులి కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పులి కదలికలు గుర్తించేందుకు నాలుగు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. మత్తు మందు ప్రయోగం నుంచి పులి రెండుసార్లు తప్పించుకుంది.
ప్రజలను భయపెడుతున్న మ్యాన్ ఈటర్‌ను బోను ఎక్కించడమే టార్గెట్ గా ఆపరేషన్ టైగర్ ఫైనల్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటికే పులి కోసం ఎరగా వేసిన ఆవుపై దాడి చేసి చంపిన పులి.. మరోసారి వచ్చే అవకాశాలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో 20 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మంచెపై పులి కోసం ర్యాపిడ్ రెస్క్యూ టీం సిద్ధంగా ఉంది. మత్తు మందు ఇచ్చే వెటర్నరీ వైద్యులు కూడా అలర్ట్ గా ఉంటూ.. రెస్క్యూ టీమ్ లో భాగమయ్యారు.పులి ఫారెస్ట్‌ను క్రాస్ చేసే రాజక్క దేవార, మత్తడి స్ప్రింగ్ ఆనకట్ట సమీపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ద్వారా పులి కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది ర్యాపిడ్ రెస్క్యూ టీం.
