29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ట్రాక్టర్ క్రాంతి 2021.. ఈ సారి 40 లక్షల ట్రాక్టర్లు

కొత్త చట్టాలను రద్దు చేసేదాకా వెనక్కి తగ్గేది లేదని.. పోరాటాన్ని ఇంకా ఉదృతం చేస్తామని రైతు సంఘాలు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి. ఇది రైతు ఉద్యమం కాదు ప్రజా ఉద్యమం అని.. ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల మాటే వినాలని చెప్పారు.
కొత్త చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధర విధానం కొనసాగేలా చట్టం తేవాలని.. అప్పటి వరకూ ఉద్యమాన్ని వదిలి ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. పోయినసారి 20 వేల ట్రాక్టర్లతో ర్యాలీ జరిగిందని.. ఈ సారి 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ చేయడమే టార్గెట్ అని చెప్పారు. ప్రతీ ట్రాక్టర్‌ మీదా ‘ట్రాక్టర్‌ క్రాంతి (విప్లవం) 2021’ అని రాయాలని సూచించారు.
ఇదిలా ఉండగా హరియాణకు చెందిన కరమ్‌వీర్‌ సింగ్‌ అనే రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ” మోదీ ప్రభుత్వం కనీసం నా మరణం తరువాతనైనా చట్టాలు రద్దు చేస్తుదా?” అని లేఖ రాసి టిక్రీ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

- Advertisement -

Latest news

Related news