29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రైళ్లు పట్టాలెక్కేది ఎప్పుడంటే..

అప్పుడెప్పుడో లాక్‌డౌన్ అన్నప్పుడు ఆగిపోయిన రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ ప్రయాణాలు మాత్రం రద్దీగానే జరుగుతన్నాయి. అందుకే రెగ్యులర్ ట్రైన్స్ ఎప్పుడు మొదలవుతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం నడుపుతున్న స్పెషల్ ట్రైన్ సర్వీసులను పండుగల దృష్ట్యా మార్చి నెలాఖరు దాకా పొడిగించడంతో.. అప్పటివరకూ రెగ్యులర్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదనే అనుకోవాలి. అంటే ఏప్రిల్ వరకూ రైళ్లు మొదలుకాకపోవచ్చు. అయితే వ్యాక్సినేషన్ ఇప్పుడే మొదలైంది కాబట్టి వ్యాక్సిన్ అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి చేరడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ ట్రైన్స్ సర్వీసులను తిరిగి రన్ చేయడంపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంటున్నారు.

- Advertisement -

Latest news

Related news