23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

బయటపడ్డ మరో సొరంగం, ఆయుధాలు

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో పాక్ బోర్డర్ దగ్గర బీఎస్‌ఎఫ్‌ మరో సొరంగాన్ని గుర్తించింది. సరిహద్దు దగ్గర సొరంగాలు గుర్తించడం ఇది రెండోసారి. ఇప్పుడు గుర్తించిన సొరంగం 3 అడుగుల వ్యాసంతో 150 మీటర్ల పొడవుతో.. పాక్ భూబాగంలోకి ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు చొరబడటానికి దీనిని నిర్మించినట్టు తెలుస్తుంది.
మరో పక్క కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల స్థావరం ఒకటి దొరికింది. నిఘా వర్గాల సమాచారంతో.. హాదిగూడలోని అడవుల్లో బీఎస్ఎఫ్ తనిఖీలు చేయగా. ఒక స్థావరం కనిపించింది. అందులో ఏకే47,మూడు చైనా పిస్టల్స్, నాలుగు చేతి గ్రనేడ్ లు, వందకు పైగా మ్యాగజైన్లు దొరికాయి.

- Advertisement -

Latest news

Related news