32.7 C
Hyderabad
Monday, March 1, 2021

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా సిద్ధమని సంకేతాలిచ్చింది. ట్విటర్  ఇండియాలో పనిచేయాలంటే దేశ చట్టాలను పాటించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఇండియాలో రాజ్యాంగం, స్థానిక చ‌ట్టాలే సుప్రీం. బాధ్యతాయుత సంస్థలు క‌చ్చితంగా స్థానిక చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఒక ప్రక‌ట‌న జారీ చేసింది. ట్విట‌ర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబ‌ల్ ప‌బ్లిక్ పాల‌సీ మోనిక్ మెచె, డిప్యూటీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ జిమ్ బేక‌ర్‌ల‌తో ఐటీ శాఖ కార్యద‌ర్శి వ‌ర్చువ‌ల్ మీటింగ్ పూర్తయిన త‌ర్వాత ఈ ప్రక‌ట‌న జారీ కావడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం 1178 అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా ట్విటర్ ని ఆదేశించింది. కానీ కేవ‌లం 500 అకౌంట్లనే బ్లాక్ చేసిన ట్విటర్.. . భావ ప్రక‌ట‌న స్వేచ్ఛ పేరుతో మిగ‌తా అకౌంట్లను తొలగించేందుకు నిరాకరించింది. అవ‌స‌ర‌మైతే దీనిపై కోర్టుకు వెళ్లాల‌ని ట్విట‌ర్ భావిస్తోంది.

- Advertisement -

Latest news

Related news