రైతు ఉద్యమానికి సంబధించి ట్విట్టర్ వేదికగా.. రచ్చ జరుగుతుండడంతో.. రైతు ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారి అకౌంట్లను నిలిపివేయాలని కేంద్రం ట్విటర్ ను కోరింది. దాంతో ఈ విషయంపై రీవ్యూ చేసిన ట్విట్టర్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది.
తప్పుడు సమాచారం, రెచ్ఛగొట్టే కంటెంట్ తో కూడిన ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేయనున్నాం అని ట్విట్టర్ ప్రకటించింది. అలాగే హానికరమైన హ్యాష్ ట్యాగ్ లను కుదించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. అయితే జర్నలిస్టులు, మీడియా ప్రతినిథులు, యాక్టివిస్టులు, రాజకీయ నేతల ట్వీట్లను బ్లాక్ చేయమని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అకౌంట్లను రీవ్యూ చేసి బ్లాక్ చేస్తామని చెప్పింది.
