రైతుల ఉద్యమం ఇప్పుడు మన దేశంలోనే కాదు.. ప్రపంచమంతటా హాట్ టాపిక్ అయింది. అమెరికన్ పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్ తో.. ఈ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. బాలీవుడ్ స్టార్ల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది.
తాప్సి vs కంగనా
రిహానా ట్వీట్‌కు కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఒక్కొక్కరు ఆమె ట్వీట్‌కు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. సినీ స్టార్స్, క్రికెటర్లు, రాజకీయనాయకులు ఇలా అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే రిహన్నాకు కంగనా ఇచ్చిన కౌంటర్ కు తాప్సీ తనదైన స్టైల్ లో రీకౌంటర్ ఇచ్చింది. “ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే.. ఒక జోక్ మీ విశ్వాసాన్ని సడలింపజేస్తే.. ఒక ప్రదర్శన మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావిస్తే ముందుగా మీరు మీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప.. ప్రాపంగాండపై ఇతరులకు లెక్చర్ ఇచ్చే టీచర్‌గా మారొద్దు” అంటూ తాప్సీ ట్వీట్ చేసింది.
దీనికి కంగనా ఊరుకుంటుందా.. “బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. ఒకరి విశ్వాసం అనేది మాతృభూమి, కుటుంబం కోసం నిలబడటంపై ఉంటుంది. ఇది కర్మ లేదా ధర్మ ఫలంగా వస్తుంది తప్ప ఉచిత సలహాలను వినొద్దు. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను” అంటూ తాప్సీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.
రోహిత్‌కు కూడా కౌంటర్
ఫార్మర్స్ ప్రొటెస్ట్ పై పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్త్తో పాటు మన క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. రీసెంట్ గా రోహిత్ శర్మ “మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు భారత్ బలంగా ఉంటుంది. రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ ప్రగతిలో రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. అందరం కలిసి ఈ సమస్యకో పరిష్కారం కనుగొనడంలో అందరు తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కూడా కంగనా కౌంటర్ ఇచ్చింది. “ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు?” అంటూ కామెంట్ చేసింది. ఈ ట్వీట్‌ను గమనించిన ట్విట్టర్ యాజమాన్యం వెంటనే ట్వీట్‌ను తొలగించింది.దీన్ని బట్టి చూస్తే.. రైతు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నవారందరికీ కంగనా కౌంటర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా “ఉద్యమం చేస్తుంది రైతులు కాదు ఉగ్రవాదులు” అన్న ట్వీట్‌ను, “రైతు ఉద్యమం దేశానికి పట్టిన క్యాన్సర్” అన్న ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది.
If one tweet rattles your unity, one joke rattles your faith or one show rattles your religious belief then it’s you who has to work on strengthening your value system not become ‘propaganda teacher’ for others.
— taapsee pannu (@taapsee) February 4, 2021
India has always been stronger when we all stand together and finding a solution is the need of the hour. Our farmers play an important role in our nation’s well being and I am sure everyone will play their roles to find a solution TOGETHER. #IndiaTogether 🇮🇳
— Rohit Sharma (@ImRo45) February 3, 2021