25.4 C
Hyderabad
Sunday, January 17, 2021

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు.. భార్య మృతి

కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌ (68) తీవ్రంగా గాయపడగా.. ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌ మరణించారు. కర్ణాటకలోని ధర్మస్థల నుంచి గోవాకు తిరిగొస్తుండగా ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలాలో ఈ ప్రమాదం జరిగింది. కేంద్ర మంత్రి త‌న భార్యతో క‌లిసి ఆదివారం ఉడుపిలోని శ్రీకృష్ణ మ‌ఠంను సంద‌ర్శించారు. శ‌నివారం ధ‌ర్మస్థల‌లో ఓ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు.  

ప్రమాదం జరిగిన సమయంలో కారులో కేంద్రమంత్రితో సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం సోమ‌వారం రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్యలో జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రైవర్‌ తప్పిదంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.  రోడ్డుప్రక్కనున్న చెట్టును కారు బలంగా ఢీకొనడంతోనే ప్రమాదం తీవ్రత అధికంగా ఉందని ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. సంఘటన స్థలంలోనే కేంద్ర మంత్రి భార్య మరణించారని, చికిత్స పొందుతూ మంత్రి పీఏ మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు. అపస్మారకస్థితిలో ఉన్న కేంద్రమంత్రిని గోవా వైద్య కళాశాలకు  తరలించారు.  ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

కేంద్రమంత్రి శ్రీపాద త్వర‌గా కోలుకోవాల‌ని క‌ర్ణాట‌క సీఎం బీఎస్ యెడియూర‌ప్ప ట్వీట్ చేశారు. శ్రీపాద భార్య మృతిప‌ట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శ్రీపాద నాయ‌క్ త్వర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు మంత్రులు, ఆయ‌న మ‌ద్దతుదారులు కోరుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...