24.2 C
Hyderabad
Friday, January 22, 2021

యూపీలో పరిస్థితి బాగలేదంటూ సీఎం యోగీకి మాజీ అధికారుల లేఖ

ఉత్తరప్రదేశ్ దేశంలోనే విద్వేష పూరిత రాజకీయాలకు కేంద్రంగా మారిపోయింది. కులమతాల కుమ్ములాటలు, బహుభార్యత్వం, హింస వంటివి బాగా పెరిగిపోయాయని యూపీ మాజీ ఐఏఎస్ అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖలు రాశారు.

యూపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన మత మార్పిడుల వ్యతిరేక ఆర్డినెన్స్ రాష్ట్రాన్ని ‘ఎపిసెంటర్ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ హేట్’ గా మార్చేసిందని లేఖలో 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు, ప్రధానికి మాజీ సలహాదారు టీ.కె.నాయర్ వంటి ఉన్నతాధికారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. చట్ట విరుధ్దమైన ఈ ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆత్మపరిశీలన చేసుకోవాలని, చైతన్యవంతులుగా మారాలని మాజీ ఐఎఎస్ అధికారులు యూపీ సీఎం యోగికి సూచించారు.

ఒకప్పుడు  గంగా,జమునా నాగరికతకు పుట్టినిల్లుగా ఉన్న  యూపీ పూర్తిగా మారిపోయిందని, ప్రభుత్వ పాలనా సంస్థలు మతతత్వ విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారని, మొరాదాబాద్ జిల్లాలో ఇద్దరు యువకులను భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసు స్టేషనుకు ఈడ్చుకెళ్లి చేయని నేరాన్ని ఒప్పుకోవాలని వారిని ఒత్తిడి చేసారని తెలిపారు. ఈ తతంగాన్ని పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారన్నారు. ఇలాంటి పలు ఘటనలను లేఖలో ప్రస్తావించారు.

- Advertisement -

Latest news

Related news

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న...

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...