29.3 C
Hyderabad
Monday, March 1, 2021

కాపర్ వాటర్‌తో లాభాలెన్నో..

ఈ మధ్య చాలామంది కాపర్ బాటిల్స్, రాగి చెంబుల్లో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. రాగి పాత్రలలో నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నిజంగా రాగి పాత్రలు అంత మంచివా? నిపుణులు ఏమంటున్నారు?

Moscow mule ice cold cocktail in copper cup with lime and and mint on gray stone background Moscow mule ice cold cocktail in copper cup with lime and and mint on gray stone background, copy space. copper mug stock pictures, royalty-free photos & images


రాగికి ఉన్న ప్రత్యేకతను పాత కాలంలోనే గమనించారు. విద్యుత్ ను ప్రసరింపజేసే రాగి.. నీటితో కలిస్తే.. ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్‌తో రాగి రియాక్షన్ జరుపుతుందని తెలుసుకున్నారు. ఈ రియాక్షన్ వల్ల నీటి గుణం కూడా మారిపోతుంది. అందుకే రాగి పాత్రలో ఉంచిన నీటి రంగు, రుచి, వాసనలో తేడాని రావడం గమనించొచ్చు.

Buy Pure Copper Utensils Online | Copper Vessels & Corporate Gifts Store


లాభాలివే…
కాపర్ మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్‌లో ఒకటి. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి కాపర్ ఈజీగా లభిస్తుంది. అలాగే రాగినీటి వల్ల మెలనిన్‌ ఉత్పత్తి మెరుగుపడుతుంది. మెలనిన్ వల్ల చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రాగి పాత్రల్లో నీరు సహజంగానే శుద్ధి అవుతుంది. అందులో నిల్వ ఉచడం వల్ల అందులో ఉండే క్రిములన్నీ నాశనం అవుతాయి. అలాగే కాపర్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని కొన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడతుంది. అల్సర్లు తగ్గడానికి సాయపడుతుంది.
రాగి పాత్రల్లోని నీరు కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది.
శరీరంలోని కొవ్వు కరగడానికి, బరువు తగ్గడానికి కూడా రాగి పాత్రలోని నీరు హెల్ప్ అవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.
ఇక వీటితో పాటు కాపర్ వాటర్.. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది, బాక్టీరియాని నాశనం చేస్తుంది, మెదడును చురుకుగా పని చేసేలా చూస్తుంది, రక్తహీనత అరికడుతుంది.
ఇన్ని లాభాలు ఉన్న కాపర్ ను రోజూ తీసుకోవడం మంచిది. ప్రతిసారి కాపర్ వాటర్ తాగకపోయినా.. రోజులో రెండు మూడు సార్లైనా రాగి పాత్రలు లేదా బాటిళ్లలో నీళ్లు తాగేలా ప్లాన్ చేసుకుంటే మంచిది.

- Advertisement -

Latest news

Related news