29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

త్వరలోనే దేశ ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ.. కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధన్‌

దేశ వ్యాప్తంగా 737 జిల్లాల్లో రెండో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ విజయవంతంగా జరుగుతోంది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. త్వరలోనే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అతి తక్కువ సమయంలోనే ఇండియాలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. తొలుతు హెల్త్‌కేర్ ప్రొఫెష‌న‌ల్స్‌కు ఆ త‌ర్వాత ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెల్ల‌డించారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చామ‌ని, ఆ ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని మంత్రి తెలిపారు. జ‌న‌వ‌రి 17వ తేదీన దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు పోలియా ఇమ్యునైజేష‌న్ డ్రైవ్ చేపట్ట‌నున్న‌ట్లు మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెల్ల‌డించారు. జనవరి 2న దేశ‌వ్యాప్తంగా 125 జిల్లాల్లో వ్యాక్సినేష‌న్ డ్రై ర‌న్ నిర్వహించిన విషయం తెలిసిందే. 

- Advertisement -

Latest news

Related news

కూరురితో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్తెతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...

రూ.4500 కోట్లు ఆర్జించిన ఓటీటీలు

దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గతేడాది రూ.4500 కోట్లు ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఓటీటీల వ్యాపార విలువ...

చోప్రా లైఫ్ జర్నీ.. షేర్ చేసిన అమితాబ్

పీకే, త్రీ ఇడియట్స్, సంజు, లగేరహో మున్నాభాయ్, మున్నా భాయ్ ఎంబీబీఎస్, మిషన్ కశ్మీర్, ఖామోష్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా...