దేశంలో జనవరి 16న కరోనా టీకా పంపిణీ ప్రారంభం కాగా.. అక్కడక్కడ చిన్న చిన్న అవాంతరాలు మినహా సజావుగా సాగుతోంది. తొలి దశలో ఫ్రంట్ వారియర్స్ కు టీకాలు అందజేస్తున్నారు.
ప్రధాని మోడీతో సహా రాష్ట్రాల సీఎంలు, ఎంపీలకు రెండో దశలో టీకాలు తీసుకోనున్నట్లు సమాచారం. వీరిలోనూ 50 ఏండ్లకుపైగా వయసు కలిగి, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రస్తుతం లోక్సభలో 343 మంది, రాజ్యసభలో 200 మంది ఎంపీలు 50 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ప్రస్తుతం మొదలైన తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏప్రిల్ వరకూ కొనసాగుతుంది.