32.7 C
Hyderabad
Monday, March 1, 2021

వాలంటైన్ వీక్.. ఈ వారం ప్రేమ వారం

ఫిబ్రవరి అనగానే గుర్తొచ్చేది.. వాలంటైన్స్ డే. వాలంటైన్స్ డేను ప్రంపంచమంతా.. చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనదేశంలో వాలంటైన్స్ డే ను కొంతమంది ఒప్పుకోకపోయినా.. ప్రేమికులకు మాత్రం ఈ రోజంటే చాలా ఇష్టం. అంతేకాదు వాలంటైన్స్ డే కంటే ముందే వాలంటైన్ వీక్ మొదలవుతుంది. ఫిబ్రవరి 7 అంటే ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ వాలంటైన్ వీక్ లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది.
వాలంటైన్ వీక్ ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే తో ముగుస్తుంది. ఈ వీక్ లో ఒక్కోరోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు వీటిని ఎంతో స్పెషల్ గా జరుపుకుంటారు.

రోజ్ డే
రోజా పువ్వు ప్రేమకు చిహ్నం. అందుకే వాలంటైన్ వీక్ ను రోజ్ డే తో మొదలుపెడతారు. ప్రేమించే వ్యక్తికి ఈ రోజు పువ్వు ఇస్తే స్పెషల్ గా ఉంటుంది.
ప్రపోజ్ డే
ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పాలంటే దానికి ఈ రోజు పర్ఫెక్ట్. ప్రపోజ్ డే రోజు ప్రేమికులు తమ మనసులో మాటను పంచుకుంటారు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తారు.
చాక్లెట్ డే
ప్రేమ అనే ఫీలింగ్ ను తియ్యగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారితో కలిసి ఒక చాక్లెట్ ను పంచుకుంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సెలబ్రేషన్ కు తియ్యదనం తోడైతే ఆ ఫీలింగే వేరు.
టెడ్డీ డే
అమ్మాయిలకు టెడ్డీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రోజున ఒక టెడ్డీ ఇచ్చి ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయొచ్చు. ప్రేమను క్యూట్ గా ఎక్స్ ప్రెస్ చేయడానికి టెడ్డీ బెస్ట్ గిఫ్ట్.
ప్రామిస్ డే
ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలపడం కోసం.. ఒకరినొకరు ఎప్పుడూ వీడిపోమని ప్రమాణం చేసుకోవడం కోసమే ఈ రోజు. ప్రామిస్ డే రోజు ‘నేను నిన్ను ఎప్పటికీ వీడన’ని ప్రమాణం చేసుకుంటారు ప్రేమికులు.

Image result for lovers


హగ్ డే
ఒక కౌగిలింత ఎన్నో బాధలను దూరం చేస్తుంది. ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలు, ఇబ్బందులన్నీ పక్కన పెట్టి ఒకరినొకరు హత్తుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. అలాంటి హగ్ కోసమే ఈ రోజు.
కిస్ డే
ప్రేమను మరింత మధురంగా మార్చే ముద్దు కోసం కూడా ఒక రోజు ఉంది. అదే కిస్ డే.. ఒకరి మీద ఒకరికున్న అఫెక్షన్‌, లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ముద్దును మించినది మరోకటి లేదని ప్రేమికులు నమ్ముతారు.
వాలంటైన్స్ డే
వాలంటైన్ వీక్ లో చివరి రోజు వాలంటైన్స్ డే. ఈ రోజున ప్రేమికులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలర్పించిన వాలెంటైన్‌ కు గుర్తుగా ఈ రోజు వచ్చింది. వాలంటైన్స్ డే రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు వారికి నచ్చిన విధంగా తమను ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు.

- Advertisement -

Latest news

Related news