ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నానికి ఫ్రెండ్ గా నటించి.. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యూత్ కి ఫేవరెట్ హీరో అయ్యాడు.

రౌడీ అనే సొంత బ్రాండ్ తో ఫ్యాషన్ మార్కెట్ లో కూడా అడుగుపెట్టాడు. అయితే తక్కువ సమయంలోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకి సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో ఇంస్టాగ్రామ్ లో విజయ్ 10 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటాడు. సౌత్ ఇండియా మొత్తంలో 10 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండనే కావడం విశేషం. అంతేకాదు.. ఇంస్టాగ్రామ్ లోకి ఎంటరైన అతి తక్కువ సమయంలోనే విజయ్ పది మిలియన్ల మార్కును చేరుకోవడం విశేషం. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో “ఫైటర్” అనే సినిమా చేస్తున్నాడు విజయ్.