దేశంలోని పలు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని.. తిరిగి చెల్లించకుండా రుణలు ఎగ్గొట్టి పారిపోయాడు విజయ్ మాల్యా. బ్రిటన్ లో తల దాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పుడు చేతి ఖర్చులకు కూడా డబ్బులు లేనంత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. నిధుల కొరతతో సతమతమవుతున్నాడు.
ఫ్రాన్స్‌లోని తన స్థిరాస్తులను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన నేపథ్యంలో జీవన, కోర్టు ఖర్చుల కోసం రూ. 15 కోట్లు ఇప్పించాలని బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. విజయ్ మాల్యా విన్నపాన్ని డిప్యూటీ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు న్యాయమూర్తి రాబర్ట్ షాఫెర్ తిరస్కరించారు. వచ్చే వారం కీలక విచారణ ఉన్నందున కోర్టు ఖర్చుల నిమిత్తం 2.4 లక్షల పౌండ్లు తీసుకునేందుకు మాల్యాకు అనుమతి ఇచ్చారు.