29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

పెళ్లిలో వెరైటీ ప్రమాణం.. వీడియో వైరల్..

మన సమాజంలో పెళ్లికి ఇచ్చే ప్రాముఖ్యత దేనికీ ఇవ్వరు. దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లి సమయంలో భార్యా భర్తలు ఒకరిపై ఒకరు గౌరవం, ప్రేమతో ఉండాలని, ఉంటామని వారితో చెప్పిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లిలో ఈ తంతు కాస్త వింతగా జరిగింది. ఎలా అంటే..

మధ్యప్రదేశ్‌లోని భగవాస్‌పురా తహశీల్‌ పరిధిలోని ధబ్లా అనే గ్రామంలో అర్సే, నైజా అనే జంటలకు ఈ నెల 15న పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో ఒకరని విడిచి ఒకరు ఉండబోమని పవిత్ర గ్రంధాల సాక్షిగా ప్రమాణం చేస్తారు. అందరి జంటల్లాగే వీళ్లు కూడా ప్రమాణం చేశారు. అయితే వీళ్లు వెరైటీగా రాజ్యాగం మీద ప్రమాణం చేశారు. రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం రోజున ప్రతిజ్ఞ చేసినట్లుగానే రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

- Advertisement -

Latest news

Related news