26.8 C
Hyderabad
Monday, March 1, 2021

ఎండలో నిల్చుంటే.. బరువు తగ్గొచ్చా?

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే.. సింపుల్‌గా రోజూ కాసేపు ఎండలో నిల్చుంటే సరిపోతుంది. అదెలా అనుకుంటున్నారా…
రోజూ ఉదయం, సాయంత్రం ఎండలో నిల్చోడం వల్ల బరువు తగ్గొచ్చని స్టడీలు చెప్తున్నాయి. శరీరంలో కొవ్వులను కరించేందుకు సూర్య కాంతి మెరుగ్గా పనిచేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ అధ్యయనం చెప్తుంది.

కొవ్వుని కరిగిస్తుంది

ఉదయం పది లోపు అలాగే సాయంత్రం నాలుగు తర్వాత వచ్చే ఎండ నుంచి శరీరానికి విటమిన్ D లభిస్తుంది. అయితే ఈ ఎండ ద్వారా లభించే విటమిన్ D శరీరంలోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది. సూర్యరశ్మిలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలు తాకగానే కొవ్వు కణాలు కరిగే ప్రక్రియ మొదలవుతుందని స్టడీ చెప్తుంది. అంతేకాదు విటమిన్ D ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా కూడా బరువు తగ్గే వీలుందంటున్నారు రీసెర్చర్లు. పుట్టగొడుగులు, గుడ్లు, చేపల్లో విటమిన్ D ఉంటుంది. అప్పుడప్పుడు అవి తిన్నా మంచిదే.

ఎంతసేపు ఉండాలి?
శరీరంలో కొవ్వులు కరగాలంటే.. పొద్దున్నే ఎండ ఉన్నప్పుడు కనీసం పది నుంచి పదిహేను నిముషాలు ఎండలో నిల్చోవాలి. అదే చలికాలంలో అయితే చలికి ఎండ సరిగ్గా తగలదు కాబట్టి అర్ధగంట పాటు ఉండొచ్చు.

ఎక్కువ సేపు ఉంటే..
ఎండలో ఉంటే మంచిది కదా అని ఎక్కువసేపు ఎండలో నిల్చుంటే ప్రమాదమే.. సూర్యరశ్మి ఎక్కువగా తాకడం వల్ల చర్మం పాడవుతుంది. అందుకే రోజులో కొద్దిసేపు మాత్రమే ఎండలో ఉండాలి. అదీ ఉదయం సాయంత్రపు ఎండలో మాత్రమే ఉండాలి.

- Advertisement -

Latest news

Related news