సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ భారతీయ వినియోగదారుల గోప్యతా విషయంలో ‘ఏకపక్షంగా’ వ్యవహరిస్తుందని అడిషిషనల్ సోలిటర్ జనరల్ చేతన్ శర్మ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. యూరోపియన్ లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడం నేరం కావడంతో అక్కడ తప్పనిసరిగా వాట్సాప్ నిబంధనలను అంగీకరించాలనే నిబంధన లేదు.. కానీ ఇండియాలో అందుకు విరుద్దంగా వాట్సాప్ యూజర్లు తప్పనిసరిగా నిబంధనలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తోందని కేంద్రం కోర్టుకు చెప్పింది.
కొత్త పాలసీ నిబంధనలకు సంబందించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వాట్సాప్ కు లేఖ పంపినట్లు విచారణ సందర్భంగా చెప్పారు. అయితే ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు చెప్పారు. అనంతరం ఈ విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ కొత్త పాలసీ ప్రకటన వచ్చాక చాలా మంది వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్ లకు తరలివెళ్తున్నారు.