వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా శుక్రవారం బయటపెట్టారు.
దేశంలో 400 మిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే అందులో చాలామంది వాట్సాప్ ను డెస్క్‌టాప్, పీసీల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా వెబ్ ను ఉపయోగించేవాళ్ల పర్సనల్ నంబర్లు గూగుల్ సెర్చ్ లో ఇండెక్సింగ్ కనిపిస్తున్నాయని రీసెంట్ గా ప్రూవ్ అయ్యింది. దీనిపై రీసెర్చ్ చేసిన రాజశేఖర్ రాజహరియా.. ఆ వ్యక్తిగత ఇండెక్సింగ్ నంబర్లను షేర్ చేశారు.
వాట్సాప్ చెప్పినా…
ఎవరైనా వెబ్ వర్షన్ ద్వారా వాట్సాప్ యూజ్ చేస్తున్నప్పుడు గూగుల్ సెర్చ్‌లో మొబైల్ నంబర్లు ఇండెక్స్ అవుతాయి. అయితే అలా ఇండెక్స్ అయిన నంబర్లు సెర్చ్ లో కనిపించడం ప్రైవసీకి పెద్ద ముప్పే అని చెప్పాలి. లీకైన ఇండెక్సింగ్ నంబర్లు బిజినెస్ నంబర్లు కావని, పర్సనల్ నంబర్లే అని రాజహరియా తెలిపారు. అంతకుముందు ఇలానే ప్రైవేటు గ్రూప్ చాట్ లింక్స్ గూగుల్ సెర్చ్‌లో కనిపించాయి. దీని గురించి ఇష్యూ కాగా వాట్సాప్ స్పందిస్తూ.. ఇలాంటి చాట్లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‌ను కోరామని తెలిపింది. అయినప్పటికీ ఇప్పుడిలా సెర్చ్ లో కనిపిస్తున్నాయంటే.. వాట్సాప్ చెప్పినప్పటికీ గూగుల్ ఇంకా ఇండెక్స్ చేస్తూనే ఉందని అర్ధం. గూగుల్ ఇలా నంబర్లను ఇండెక్స్ చేస్తే.. ఎవరైనా సింపుల్ సెర్చ్‌తో ప్రైవేట్ గ్రూప్ చాట్స్‌లో చేరొచ్చు. అలాగే మన పర్సనల్ నంబర్లు గూగుల్ సెర్చ్ లో కూడా కనిపించే ప్రమాదముంది.
ప్రైవసీ వాయిదా..
ఇదిలా ఉండగా తమ ప్రైవసీ పాలసీని కొద్ది రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు వాట్సాప్.. తన బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. వ్యక్తిగత డేటా ఫేస్‌బుక్‌కు షేర్ చేస్తోందంటూ అనుమానాలు వ్యక్తమవుతుండడంతో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబందన ఫిబ్రవరి 8 వరకు ఉండగా.. తాజాగా దానిని మే 15 వరకు వాయిదా వేసింది.